సినీ హీరో అల్లు అర్జున్ పై అదనపు కేసులు నమోదు చేయాలి
- Vijaya Preetham
- Dec 24, 2024
- 1 min read
సీనియర్ న్యాయవాది కొత్తూరి రమేష్

పుష్ప 2 సినిమా యాక్టర్ అల్లుఅర్జున్ పై అదనపు కేసులు పెట్టాలని, హీరోయిన్ రష్మిక మందనపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తు సీనియర్ న్యాయవాది, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తూరు రమేష్ మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంధ్య థియేటర్ హైదరాబాదులో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి మరణానికి సంబంధించి రేవతి కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయంలో క్రైమ్ నెంబర్ 376 ఆఫ్ 2024. ప్రకారం 105, 118(1), 3(5) బిఎన్ఎస్ సెక్షన్ ల ప్రకారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.అయితే ఈ కేసులో సెక్షన్ 177 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం అనుమతులు లేకుండా సినిమా యాక్టర్ అల్లు అర్జున్ తన సన్ రూప్ కార్ నుండి ప్రజలకు అభివాదం చేస్తూ, అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాంకు హీరోయిన్ రష్మిక మందన కూడా హాజరవడం జరిగిందని, కావున అదనంగా సెక్షన్ 177 మోటార్ వెకిల్ అక్ట్ మరియు హీరోయిన్ రష్మిక మందన పై కేసు నమోదు చేయాలని సంబంధిత చిక్కడపల్లి పోలీస్ వారికి మంగళవారం సీనియర్ న్యాయవాది, వ్యవస్థాపక అధ్యక్షులు సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొత్తూరు రమేష్ ఫిర్యాదు చేశాడు.
Comments