శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు హుజురాబాద్ సీఐ తిరుమల్ గౌడ్ :హుజురాబాద్
- Vijaya Preetham
- Mar 13
- 1 min read
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
హుజురాబాద్ సీఐ తిరుమల్ గౌడ్
: హుజురాబాద్


హోలీ పండుగను పురస్కరించుకుని నిబంధనలను ఉల్లంఘించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ హెచ్చరించారు. గురువారం హోలీ సందర్భంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆయన మాట్లాడారు. హోలీ వేడుకలను సాంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించాల్సిందిగా ప్రజలకు సూచించారు. మద్యం సేవించి రోడ్లపై అల్లరి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హోలీ ముగిసిన అనంతరం కాలువలు, బావులు, లోతైన కెనాల్ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ విభాగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
コメント