రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న పడిదం దేవేందర్ రెడ్డి : జమ్మికుంట
- Vijaya Preetham
- Mar 24
- 1 min read
రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న పడిదం దేవేందర్ రెడ్డి
: జమ్మికుంట


సోమవారం వరల్డ్ టిబి డే ను పురస్కరించుకొని డాక్టర్ రాజేశం జాయింట్ డైరెక్టర్ టిబి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో జమ్మికుంట టిబి సూపర్ వైజర్ పడిదం దేవేందర్ రెడ్డి సీనియర్ టిబి ట్రీట్మెంట్ సూపర్ వైజర్ గా వరుసగా 3వ సారి రాష్ట్ర స్థాయి అవార్డు కు ఎంపికయ్యారు. 2015 సంవత్సరం నుండి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, ఇళ్ళందకుంట, వీణవంక మండలాల్లో టిబి పేషంట్స్ కు మెరుగైన సేవలు అందిస్తూ టిబి వ్యాది నిర్మూలన కొరకు చేస్తున్న సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. వీరు రాష్ట్ర స్థాయి అవార్డ్ కు ఎంపిక కావడం పట్ల స్థానిక వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అభినందించారు.
Comments