మందకృష్ణ మాదిగ త్యాగాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు : జమ్మికుంట
- Vijaya Preetham
- Jan 26
- 1 min read
మందకృష్ణ మాదిగ త్యాగాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమ హుజరాబాద్ ఇన్చార్జ్ ఆకినపల్లి శిరీష : జమ్మికుంట

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం మాదిగ జాతి గర్వించదగ్గ విషయమని ఆదివారం జమ్మికుంటలో డప్పుల కళామండలి హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షురాలు ఆకినపల్లి శిరీష ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచి, బాణాసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, ఎంఆర్పిఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న మంద కృష్ణకు పద్మశ్రీ అవార్డు రావడం మాదిగ జాతికి గర్వకారనమని కొనియాడారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్ నడిబొడ్డున లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి తెలంగాణలోని ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంకన వేసుకొని హైదరాబాద్ కి తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు తిప్పారపు సంపత్ డప్పుల కళా మండలి రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ రామంచ భరత్, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు రుద్రారపు రామచంద్రం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆదిత్య, డప్పు కళామండలి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు బోయిని సమ్మయ్య, రాష్ట్ర నాయకులు మరేపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరాం, జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, హుజురాబాద్ మండల నాయకులు ఎర్ర శ్రీధర్, మోలుగు శ్రీనివాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments