‘బద్మాషులు’ సినిమా వినోదాన్ని పంచే క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్
- Vijaya Preetham
- Jan 29
- 1 min read
‘బద్మాషులు’ సినిమా వినోదాన్ని పంచే క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్

మహేష్ చింతల, విద్యాసాగర్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ 'బద్మాషులు'. ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహిస్తున్నారు, B. బాలకృష్ణ మరియు C. రామశంకర్ నిర్మాతలుగా ఉన్నారు. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా, దర్శకుడు శంకర్ చేగూరి చిత్రంలోని విశేషాలను వివరించడంతో, "గ్రామీణ నేపథ్యంలో సాగిన హాస్యభరిత చిత్రమిది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్వించడమే కాదు, ప్రతీ పాత్ర కూడా నిజజీవితంలో ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ సరదా పంచుతుంది. అలాగే, కథలో సందేశం కూడా ఉంటుంది" అని చెప్పారు.
ఈ చిత్రంలో బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం తదితరులు కూడా నటిస్తున్నారు. కెమెరా: వినీత్ పబ్బతి, సంగీతం: తేజ కూనూరు, మరియు దర్శకత్వం: శంకర్ చేగూరి.




Comments