ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ అవగాహన ర్యాలీ : జమ్మికుంట
- Vijaya Preetham
- Mar 24
- 1 min read
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ అవగాహన ర్యాలీ
: జమ్మికుంట

సోమవారం జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వావిలాల గ్రామములో డాక్టర్ రాజేష్ వైద్యాధికారి ఆధ్వర్యంలో సెంట్ మేరీ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. వావిలాల గ్రామములోని పుర వీధులలో టి బి అంతం-మన అందరి పంతం. టి బి రహీత సమాజాన్ని నిర్మిద్దాం. టిబికి పరీక్షలు ఉచితం. టీబికి పరీక్షలు మందులు ఉచితం వంటి నినాదాలతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం పాఠశాలలో విద్యార్థులకు డాక్టర్ రాజేష్, హెల్త్ ఎడ్యుకేటర్ అడిదెల మోహన్ రెడ్డి టిబి వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా చెప్పినారు. ఎవరికైనా రెండు వారాలకి మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవటం, రాత్రి పూట చెమటలతో జ్వరం రావటం, దగ్గులో తెమడ పడటం, అలసట వంటి మొదలగు లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్ కి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వ్యక్తి గత పరిశుభ్రత పై అవగహన కల్పించారు. వడ దెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు. అనంతరం విద్యార్థులచే మానవహారం నిర్వహించి, టి బి ప్రతిజ్ఞ చూపించారు.
ఈ కార్యక్రమములో డాక్టర్ రాజేష్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్దు గేరోజ్, హెల్త్ సూపర్ వైజర్స్ సదానందం, కుసుమకుమారి, స్టాఫ్ నర్స్ సాయికుమార్, ఏఎన్ఎం రమ, ల్యాబ్ టెక్నీషియన్ రామక్రిష్ణ, ఆశా కార్యకర్తలు సుమలత, రమ, మణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments