ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టుల బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్ : జమ్మికుంట
- Vijaya Preetham
- Mar 22
- 1 min read
ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టుల
బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్
: జమ్మికుంట

ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా అని బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్ అన్నారు. శనివారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో వారి స్వగృహంలో రాష్ట్ర నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్ ను పోలీసులు అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యారంగం మొత్తం నిర్వీర్యం అయ్యే పరిస్థితిలో ఉందన్నారు. దీనికి నిదర్శనం బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులు చూస్తే అర్థమవుతుందని. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 నెలల కాలంలో నేటి బాలలే రేపటి పౌరులని చెప్పుకునే విద్యావ్యవస్థలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగంలో అనేక మార్పులు వచ్చిన విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం, ఫర్నిచర్ సౌకర్యం లేకపోవడం, సమస్యలకు నిలయంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండడం వలన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్... 600 గురుకుల పాఠశాలలో ప్రారంభించి లక్షలాది మంది విద్యార్థులకు ఏ చిన్న సమస్య వచ్చినా వారికి అండగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. వేల మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్ది అనేక మంది విద్యార్థులను విద్యావంతులుగా చేసి అన్ని రంగాల్లో వారు ఉండే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం 23 వేల కోట్లు కేటాయించడం అవి ఉపాధ్యాయుల జీతభత్యాలకే సరిపోయే విధంగా లేవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్ ని సవరించి కొఠారి కమిషన్ ప్రకారం 30 శాతం నిధులు కేటాయించాలని. అదేవిధంగా అక్రమ అరెస్టులను చేస్తే ప్రజలే రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ 15 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి 20 శాతం మార్పులు కూడా రాలేదన్నారు. ఈ అక్రమ అరెస్టులను ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments