తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు – ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి గారు
- Vijaya Preetham
- Jul 11
- 1 min read
📍ప్రెస్ నోట్
తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు – ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి గారు


ఈరోజు హైదరాబాద్‌లోని లక్డికపుల్ లోని వాసవి క్లబ్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, పరిశ్రమలు, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాల సంఘాల ప్రముఖులు, రాష్ట్రస్థాయి నేతలు, విద్యార్థి, యువజన ప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ —
తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోంది. మాల సంఘాలు సుదీర్ఘకాలంగా సాధికారత కోసం పోరాడుతున్నాయి. ప్రభుత్వ విధానాలు అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించేలా ఉండాలని కృషి చేస్తాం,” అని హామీ ఇచ్చారు
అలాగే మాల మహానాడు ద్వారా వచ్చిన ప్రతిపాదనలు, సమస్యలు పై స్వయంగా సమీక్షిస్తానని మంత్రి గారు తెలియజేశారు.
శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి
మంత్రి – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
Comentários