top of page

ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతున్న ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • Feb 11
  • 2 min read

ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతున్న ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’


సూర్య ద్విపాత్రాభినయంలో సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో 'వారణం అయిరమ్' పేరుతో విడుదలైంది. తెలుగులో ఈ చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'గా డబ్ చేయబడింది. 2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం, తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. గతంలో రీ రిలీజ్ చేసినప్పుడు కూడా అద్భుతమైన విజయం అందుకుంది. తాజాగా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి తెలుగులో విడుదల కాబోతోంది.


ఈ సందర్భంగా తెలుగు అనువాద బ్యానర్ సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు మాట్లాడుతూ..

''*సూర్య సన్నాఫ్ కృష్ణన్* ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న తెలుగులో విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటన చూపించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా ఈ మూవీ పాటలు లేకుండా కనిపించవు. ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందినవే. పివిఆర్ థియేటర్స్ వారు 'లవర్స్ డే వీక్' అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ వీక్‌లో 12న తెలుగు వెర్షన్ *సూర్య సన్నాఫ్ కృష్ణన్* ప్రదర్శించబోతున్నారు. మూవీ బుకింగ్స్ ఓపెన్ అయిన కాసేపట్లోనే ఫుల్ అవుతోంది. 13న మరో షో వేస్తున్నారు, అది కూడా ఫుల్ అవుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టపడుతున్నారు. 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లో విడుదలకాబోతోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ అన్ని ప్రాంతాల్లో మేమే విడుదల చేస్తున్నాం. మొత్తం 300కి పైగా షోలు ప్లాన్ చేశాం. యూత్ ఈ మూవీ కోసం ఎంతో ఎదురు చూస్తోంది. ఈ చిత్రాన్ని బూస్ట్ చేస్తున్న పివిఆర్ కు థ్యాంక్స్ చెప్తున్నాం. 12, 13 తేదీల్లో ప్రదర్శనలు ఉన్నా, 14న ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. ఈ మూవీలోని 7 పాటలు యూత్ కు ఎప్పటికీ ప్రియమైన పాటలుగా ఉన్నాయి. ఇలాంటి చిత్రాన్ని విడుదల చేయడం మా సంస్థకు గర్వకారణం అని చెప్తున్నాం..'' అన్నారు.


నటీనటులు:

సూర్య

సిమ్రన్

సమీరా రెడ్డి

రమ్య

దీపా నరేంద్రన్

బబ్లూ పృథ్వీ

అవిషేక్ కార్తీక్

గౌతమ్ మీనన్


టెక్నీషియన్స్:

సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు

ఎడిటింగ్: ఆంటోనీ

సంగీతం: హ్యారిస్ జయరాజ్

నిర్మాణ సంస్థ: ఆస్కార్ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్

తెలుగు నిర్మాత: సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్

దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్

పిఆర్వో: మధు వి.ఆర్

Commentaires


JOIN OUR MAILING LIST

Sign up to receive exclusive updates, behind-the-scenes content, and more!

  • Instagram
  • Facebook
  • X
  • YouTube
  • Whatsapp

© 2024 Vijaya Preetham. All rights reserved.

bottom of page