top of page

నా చివరి శ్వాస వరకు కేసిఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు..! ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • Mar 12
  • 1 min read

నా చివరి శ్వాస వరకు కేసిఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు..!

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి : హుజురాబాద్

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ… తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఒక ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ, “ బీఆర్ఎస్ నా కుటుంబం… కేసిఆర్ నా నాయకుడు. ఎప్పటికీ అదే పార్టీ, అదే నాయకుడి వెంట నా చివరి శ్వాస వరకు ఉంటా అని చెప్పారు. బీఆర్ఎస్ కి నాకు వున్న అనుబంధాన్ని ఎవరూ తెంచలేరు అని ధ్వజమెత్తారు. కొంతమంది నా ప్రజాదరణను చూసి ఓర్వలేక… కాంగ్రెస్ పార్టీకి ఉ న్న చేతగాని పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ.. నా రాజకీయం, నా నమ్మకం, నా జీవితం అంతా బీఆర్ఎస్ పార్టీకి అంకితం అన్నారు. అధికారంలో వున్నా, లేకపోయినా… నేను కేసిఆర్ తోనే ఉంటా అని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు తెలిపారు. అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులెవ్వరూ ఇలాంటి అబద్ధాలను నమ్మొద్దు. వీటిని ధీటుగా తిప్పికొట్టాలి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Comments


JOIN OUR MAILING LIST

Sign up to receive exclusive updates, behind-the-scenes content, and more!

  • Instagram
  • Facebook
  • X
  • YouTube
  • Whatsapp

© 2024 Vijaya Preetham. All rights reserved.

bottom of page