top of page

'తల' సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీపై ప్రశంసలు కురిపించిన గెస్ట్‌లు

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • Feb 12
  • 3 min read

'తల' సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీపై ప్రశంసలు కురిపించిన గెస్ట్‌లు

ree

ree

దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం 'తల'. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రోహిత్, ఎస్తేర్ నోరన్, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీని అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 14న విడుదలకాబోతున్న 'తల' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన..

ree

దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. "పాత తరంలో తల తాకట్టుపెట్టినా పిల్లలను ప్రయోజనకులను చేయాలంటారు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ తల పెట్టి కొడుకును మంచి హీరోగా మార్చారు. టైటిల్ 'తల' అన్నప్పుడు తమిళంలో వేరే అర్థం ఉండవచ్చు, కానీ తెలుగులో దీని అర్థం వేరే. గ్లింప్స్ బాగున్నాయి. రాగిన్ రాజ్ బాగా ఆకట్టుకున్నాడు. మంచి ఫ్యూచర్ ఉందని అర్థం అవుతుంది. తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజగారు పాటలను అద్భుతంగా చేశారు. ఈ 14న విడుదలకాబోతున్న ఈ మూవీ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా.." అన్నారు.


నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. "తల సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్ లో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసి, మీ అందరూ మా అమ్మ రాజశేఖర్ ఫ్యామిలీకి, అమ్మ రాగిన్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా 'తల' తరువాత, అమ్మ రాజశేఖర్ గారు మీరు తలెత్తుకుని తిరగాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్ గారిని ఎప్పుడూ మర్చిపోరు. మీరెప్పుడూ మా ఫ్యామిలీతో ఉంటారు. ఎన్నో షోస్ లో మీ జడ్జిమెంట్ ద్వారా, బిగ్ బాస్ ద్వారా అందరికీ గుర్తుంటారు. నేనూ మా అబ్బాయిని హీరోగా పరిచయం చేశాను. ఈ సినిమా మా అబ్బాయి సినిమా కంటే పెద్ద విజయం సాధించి మీరు ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.." అన్నారు.


నటుడు రోహిత్ మాట్లాడుతూ.. "ఈ 14న సినిమా విడుదలవుతోంది. మీరు అందరూ థియేటర్స్ కు వచ్చి సినిమా చూడాలి. ఈ మూవీలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఎస్తేర్ గారితో కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. హీరోయిన్ బెంగాలీ అయినా తెలుగులో డైలాగ్స్ బాగా చెప్పింది, మంచి నటన ప్రదర్శించింది. హీరో రాగిన్ ను చూస్తే నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సినిమా బావుంది కాబట్టి, మీరు రాగిన్ ను ఖచ్చితంగా ఆదరిస్తారు.." అన్నారు.


నటి విజి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. "అమ్మ రాజశేఖర్ తో నాకు అసలు పరిచయమే లేదు. ఓ సారి ఫోన్ చేసి ఈ పాత్ర గురించి చెప్పారు. నా కొడుకు కోసం నేను చేసిన సినిమా ఇది అన్నప్పుడు నేను ఓకే చెప్పాను. ఇంతమంది ఉన్నప్పటికీ నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. హీరో రాగిన్ ఈ సినిమాకు బిగ్ ఎసెట్. రాగిన్ ను నేను ట్రిపుల్ ఆర్ అని చెబుతాను. ఫస్ట్ పిక్చర్ అయినా బాగా నటించాడు. మీరు అందరూ ఈ సినిమాను థియేటర్స్ లో చూసి పెద్ద హిట్ అందిస్తారని కోరుకుంటున్నాను.." అన్నారు.


సీనియర్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "2013 నుంచి అమ్మ రాజశేఖర్ తో మంచి రిలేషన్ ఉంది. అతను కథలను కొత్తగా చెబుతాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే హీరోలో రవితేజ కనిపిస్తున్నాడు. ఈ మూవీతో రాగిన్ రూపంలో మరో కొత్త ఆణిముత్యం దొరుకుతాడు అని చెబుతున్నాను. రాజశేఖర్ కష్టం, శ్రీనివాస్ గారి నమ్మకం నిజమై ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ టీమ్ కు అభినందనలు" అన్నారు.


నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.."అందరికీ నమస్కారం.. 'తల' మూవీతో మునుపటి అమ్మ రాజశేఖర్ ను చూస్తారు. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. అతను చెప్పినదానికంటే ఇంకా బెటర్ గా తీశారు. తన కొడుకును హీరోగా నిలబెట్టాలన్న కసి కనిపించింది. రాగిన్ రాజ్ చాలా అనుభవం ఉన్న నటుడిగా కనిపించాడు. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. ఇవాళ నాకోసం వచ్చిన మిత్రలందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ 14న రిలీజ్ అవుతున్న 'తల' అన్ని రకాల ఎమోషన్స్ తో మీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది.." అన్నారు.


నటి ఎస్తేర్ మాట్లాడుతూ "ఈ కథ చాలా బావుంది. రాగిన్ రాజ్ కు మంచి డెబ్యూ అవుతుంది. అమ్మ రాజశేఖర్ గారు ఇతరుల ఫేమ్ ను వాడుకోవాలనుకోలేదు. అందరికీ గుర్తింపు వచ్చే పాత్రలే రాసుకున్నారు. ఎవరికి తగ్గ పాత్రవారికి ఇచ్చాడు. అందరూ హైలెట్ అయ్యేలా చేశారు. ఇది ఇండస్ట్రీలో రేర్ గా కనిపించే లక్షణం. నా పాత్ర నాకే ఛాలెంజింగ్ గా ఉంది. రోహిత్ గారితో వర్క్ చేయడం బావుంది. 'తల' నాకు మంచి జాబ్ శాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.." అన్నారు.


'తల' హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. "తల కథ మా నాన్న నాకు రెండేళ్ల క్రితం చెప్పారు. ఆ కథ నుంచి మీ ముందు కొత్త యాక్టర్ గా పరిచయం అవుతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. 14న ఈ చిత్రాన్ని అందరూ చూడండి. ఈ మూవీకి మా నాన్న స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నారు. నేను కొత్తవాడిని అని అందరూ నాకు చాలా నేర్పించారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో చాలా దెబ్బలు తగిలాయి. ఈ కథ చూస్తే నా వయసు 18 సంవత్సరాలు. ఆ వయసు అబ్బాయి అమ్మ సెంటిమెంట్‌తో ఏ లెవల్‌కు వెళ్ళతాడో అనేది మెయిన్ ప్లాట్. ఈ చిత్రంలో యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలూ ఉన్నాయి. అందరూ ఈ చిత్రాన్ని చూసి 'అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్' అంటారు.." అన్నారు.


దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. "మూడు నాలుగు నెలలుగా స్ట్రెస్ గా ఉన్నాను. అయినా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ. లైఫ్‌లో చాలా స్ట్రగుల్ చూశాను. ఆ టైంలో 'అమ్మ రాజశేఖర్‌కు ఏమైంది?' అన్న ప్రశ్నలను అడిగిన అందరికీ ఈ మూవీతో సమాధానం చెబుతాను. నా కొడుకు రాగిన్ రాజ్‌ను కూడా ఆశీర్వదించాలి. హిట్ తరువాత అందరి గురించి మాట్లాడతాను. శ్రీనివాస్ గౌడ్ గారి చేసిన సపోర్ట్ ను లైఫ్ లాంగ్ మర్చిపోను. మీ లాంటి మంచి వారి కోసమే ఈ సినిమా హిట్ కావాలి. 14న విడుదలవుతోన్న 'తల' చిత్రాన్ని మీరు అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.." అన్నారు.


దర్శకుడు: అమ్మ రాజశేఖర్

నిర్మాత: శ్రీనివాస్ గౌడ్

బ్యానర్: దీపా ఆర్ట్స్

నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరన్, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్

రైటర్స్: అమ్మ రాజశేఖర్

డీఓపీ: శ్యామ్ కె నాయుడు

సాంగ్: థమన్ ఎస్‌ఎస్

మ్యూజిక్ డైరెక్టర్: ధర్మతేజ, అస్లాం కేఈ

బీజీఎం: అస్లాం కేఈ

డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్

ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ

డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు: అమ్మ రాజశేఖర్

లిరిసిస్ట్స్: ధర్మతేజ

ఎడిటర్: శివ సామి

పీఆర్వో: మధు వీఆర్

డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం

Comments


JOIN OUR MAILING LIST

Sign up to receive exclusive updates, behind-the-scenes content, and more!

  • Instagram
  • Facebook
  • X
  • YouTube
  • Whatsapp

© 2024 Vijaya Preetham. All rights reserved.

bottom of page