జమ్మికుంట :కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన అయ్యప్ప స్వాములు
- Vijaya Preetham
- Dec 24, 2024
- 1 min read

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ లో అయ్యప్ప గురు స్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంటకు చెందిన అయ్యప్ప స్వాములు, బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ తో కలిసి కలవడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి చెందిన సుమారు 300 మంది అయ్యప్ప స్వాములు జనవరి 5, 9 తేదీలలో శబరిమలై వెళ్లడం కొరకు మూడు నెలల క్రితం కోర్బా ఎక్స్ ప్రెస్ రైలు టికెట్లు బుక్ చేసుకోవడం జరిగిందన్నారు. అనివార్య కారణాలవల్ల ట్రైన్ ను రైల్వే శాఖ రద్దు చేయడంతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఆందోళనతో బండి సంజయ్ ని కలిసి విషయం చెప్పడం జరిగిందనీ అన్నారు. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడి స్వాములకు ఇబ్బంది కలగకుండా చూడాలని తన కార్యదర్శి ఐఏఎస్ అధికారి వంశీకి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గురుస్వామి, మణికంఠ స్వామి, రాజశేఖర్ స్వామి, గోపి స్వామి, నిఖిల్ స్వామి, మల్లేష్ స్వామి పాల్గొన్నారు.




Comments