ఘనంగా సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలు :హుజురాబాద్
- Vijaya Preetham
- Mar 10
- 1 min read
ఘనంగా సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలు

హుజురాబాద్‌లో మహాసాద్వి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే జయంతి కమిటీ అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లోని పూలే, అంబేద్కర్ వాదులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నేతలు, మహిళలు, వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాజరై సావిత్రిబాయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు యండి ఖలీద్ యూసేన్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందే రాధిక, మాజీ వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, కాంగ్రెస్ పార్టీ మహిళా మండలాధ్యక్షురాలు పుల్ల రాధ, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గొస్కుల నాగమణి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, వేల్పుల రత్నం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, సామాజిక సమానత్వానికి మార్గదర్శకురాలిగా, విద్యా విప్లవకారిణిగా నిలిచిన సావిత్రిబాయి సేవలను కొనియాడారు. ఆమె ఆశయాలను కొనసాగించాలని అన్నారు.
Comments