గుర్రం పరుశురాములు ఆధ్వర్యంలో ఈటల పుట్టినరోజు వేడుకలు :జమ్మికుంట
- Vijaya Preetham
- Mar 20
- 1 min read
గుర్రం పరుశురాములు ఆధ్వర్యంలో ఈటల పుట్టినరోజు వేడుకలు

మాజీ మంత్రి, హుజూరాబాద్ అభివృద్ధి ప్రదాత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో గుర్రం పరుశురాములు ఆద్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు హాజరై కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం గుర్రం పరుశురాములు, కొలకాని రాజు మాట్లాడుతూ, ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయాలన్నారు. రానున్న రోజుల్లో మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు సట్ల సునీల్ గౌడ్, గౌస్, విజిగిరి రవిందర్, ఆవంచా వెంకటేష్, మేడిపల్లి మహేష్, కుమార్, రాసమల్ల కుమారస్వామి, కొలకాని అరవింద్, బుర్ర శ్రీనివాస్, గుర్రం కుమార్, రమేష్ , గట్టు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments