కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి: జమ్మికుంట
- Vijaya Preetham
- Jan 6
- 1 min read
కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి : జమ్మికుంట

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎంపీఆర్ గార్డెన్ ఎదురుగా కారు, బైక్ (ఎక్సెల్ లూనా) ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డె రాజయ్యతో పాటు దుర్గా కాలనీకి చెందిన సంపత్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా యూటర్న్ తీసుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో సంపత్ కి బలమైన గాయాలు కాగా రాజయ్యకు కాలు విరిగినట్లు చెప్పారు. సంపత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన జమ్మికుంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వరంగంటి రవి తెలిపారు.
Comments