ఏఎంసి చైర్ పర్సన్ కి సన్మానం : జమ్మికుంట
- Vijaya Preetham
- Mar 26
- 1 min read
ఏఎంసి చైర్ పర్సన్ కి సన్మానం

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంను బుధవారం రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జమ్మికుంట మండల నూరు భాషా సంఘం మండల అధ్యక్షుడు మొహమ్మద్ అలీ భాయ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వ కంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా నూర్ భాషా సంఘ నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈనెల 31న జరిగే తమ రంజాన్ పండుగ రోజున స్థానిక పాత వ్యవసాయ మార్కెట్లో నమాజ్ చేసుకొనుటకు పర్మిషన్ కోసం వినతి పత్రం అందజేశారు. ఇట్టి విషయాన్ని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు చైర్ పర్సన్ స్వప్న సదానందం పర్మిషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంఘం నాయకులు ఎండి అబ్బాస్, రఫీ మహమ్మద్, ముజ్జు, రఫీ, అశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments