ఈరోజు హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ
- Vijaya Preetham
- 4 days ago
- 1 min read
ఈరోజు హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని కలిసి ఎస్సీ

వర్గీకరణ విషయంలో రిజర్వేషన్ పరంగా ఏ గ్రూపులో ఉన్న ఉద్యోగాలు మరియు పదోన్నతులు ఇతర గ్రూపులకు తరలించకుండా బ్యాక్ లాంగ్ పోస్టులుగా ఉంచాలని . అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లలో మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మన బేడ బుడగ జంగాలకు తగు న్యాయం చేయాలని. అదేవిధంగా అన్ని రంగాలలో వెనుకబడ్డ కులాలైన ఏ గ్రూపులో ఉన్న 15 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. అదేవిధంగా హైదరాబాదులో బేడ బుడగ జంగాల ఆత్మ గౌరవ భవనం నిర్మించి ఇవ్వాలని మంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా మంత్రిగారు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు. రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కళ్లెం ముత్తు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దేవుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై బేడ బుడగ జంగం. జై జై బేడ బుడగ జంగం.




Comments