ఆంధ్రప్రదేశ్ లో క్షమాపణల రాజకీయాలు దేనికి సంకేతం…? కూటమీ లో కుంపటి రగిలించింది ఏవరు…?
- Vijaya Preetham
- Jan 10
- 1 min read
ఆంధ్రప్రదేశ్ లో క్షమాపణల రాజకీయాలు దేనికి సంకేతం…?
కూటమీ లో కుంపటి రగిలించింది ఏవరు…?

పవన్ కళ్యణ్ TTDపాలక కమిటీ పై ఘాటు విమర్శలు ఆవేదన తో చేసాడా..? ఆలోచనతో
చేసాడా..? అవివేకంతో చేసాడా..?
కథనం :-
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం టికెట్ల జారీ సంధర్బంగా జరగిన తొక్కిసలాటలో 6 భక్తులు మరణించడం మనకు తెలిసిందే కదా !
తొక్కిసలాట సంఘటన తర్వాత పరామర్శకు వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిగిన
దుర్ఘటణకు చింతిస్తూ క్షమాపణలు చెప్పాడు .
ఇంతవరకు బాగానే ఉన్నా
TTD పాలక మండలి గాని ,చైర్మన్ గాని , Excutive Officers లు ఎవరు కూడా జరిగిన సంఘటన పట్ల పశ్చాత్తాపం కానీ , క్షమాపణలు చెప్పకపోవడాన్ని పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా విమర్శించాడు ( ఈ వ్యాసం రాసే సమయానికి )
అయితే ఈ విమర్శల వెనక నిగూడ రాజకీయ కోణాలు ఉన్నాయని ,
పవన్ కళ్యాణ్ ఆ విధంగా అగ్రేసివుగా రియాక్ట్ అవడానికి
కూటమిలో ఉన్న లుకలుకలే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గడిచిన నెల రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా, ఇబ్బందికరంగా
జర్నలిజం పేరు మీద చిలక పలుకులు కారుకూతలు.. కథనాలు ప్రసారం కావడమే
పవణ్ కళ్యాణ్ ఈ రోజు ఇలా విమర్శలు చేయడానికి ప్రధాన కారణమని భావిస్తూన్నారు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుల కన్నా పవన్ కళ్యాణ్ కు ప్రజా మద్దతు పెరిగిందని
పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతూ పోతుందని
ఇందుకు నరేంద్ర మోడీ గారి మద్దతు ఉందని భవిష్యత్తులో ఇది తెలుగుదేశం పార్టీకి
ప్రమాదకరమంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా కొన్ని మిడియా సంస్థలు పలుకుల పేరు మీద
కథనాల కారుకూతలని ప్రసారం చేశాయి.
ఇదే పవన్ కళ్యాణ్ ని బాగా బాధపెట్టిందని
స్పష్టంగా పవన్ కళ్యాణ్ కు ను చంద్రబాబు నాయుడుకు మధ్యలో ఎడబాటుని ఆ మీడియా
మాఫియా లే సృష్టించి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయని గ్రహించిన పవన్ కళ్యాణ్
సమయం అవకాశం వచ్చింది కాబట్టి తన శక్తి ఎమిటో, తన రాజకీయ ఎత్తుగడలు ఎలా
ఉండబోతున్నాయో తెలయజేయడానికే ఇలా ఘాటు గా విమర్శలు చేసి ఉండవచ్చు అని
అభిప్రాయపడుతున్నారు
మరి వేరి చూద్దాం
రాబోయే రోజుల్లో కూటమిలో తెలుగు దేశం కు జనసేనకు మధ్య బంధం బలపడుతుందో బలహీనపడుతుందో చూద్దాం
By : Veerlapati Sravan Kumar
Sr. Journalist
Political Analyst
Comments