అమెరికా అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో రామ్ చరణ్!
- Vijaya Preetham
- Dec 22, 2024
- 1 min read
Updated: Dec 23, 2024

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం **‘గేమ్ చేంజర్’** జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో జోడీగా కియారా అద్వానీ నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించబడింది, దిల్ రాజు మరియు శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.
తాజాగా, డల్లాస్ (అమెరికా)లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముందుగా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది టీమ్. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్, దిల్ రాజు, శిరీష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, “డల్లాస్‌లోని అభిమానులు చూపించిన ప్రేమకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ చూపించిన ఆదరణను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నట్టు లేదా డల్లాస్‌లో ఉన్నట్టు అనిపించింది. ఓవర్సీస్‌లోని ప్రేక్షకులు మా సినిమాను ముందుగా చూస్తారు. అందరి ఆశీస్సులు మా **‘గేమ్ చేంజర్’** చిత్రానికి కావాలి" అన్నారు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ, “**‘గేమ్ చేంజర్’** అనే టైటిల్‌కు తగిన విధంగా నూతన పంథాలో ప్రమోషన్లు చేయాలని నిర్ణయించుకున్నాం. అందువల్లనే యుఎస్‌లో ఇంత భారీ స్థాయిలో తెలుగు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబడింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ" అని చెప్పారు.
Comments