Kcr Movie In OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న రాకింగ్ రాకేష్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే..?
- medhalouise
- Dec 20, 2024
- 2 min read

Kcr Movie In OTT : జబర్దస్త్ ద్వారా కమెడీయన్లు గా పాపులర్ అయిన రాకింగ్ రాకేష్ గురించి అందరికి తెలుసు. మొన్నటివరకు పలు ఈవెంట్స్ పాటుగా సినిమాల్లో నటిస్తూ నటుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య జబర్దస్త్ కమెడీయన్స్ ఒక్కొక్కరు వరుస సినిమాలను డైరెక్ట్ చెయ్యడం లేదా నిర్మిస్తున్నారు. మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నారు. మొన్న బలగం వేణు డైరెక్టర్ గా సత్తాను చాటాడు. అలాగే ఇప్పుడు రాకింగ్ రాకేష్ కూడా ఒక సినిమాను నిర్మించడంతో పాటుగా హీరోగా కూడా చేశారు. ఆ సినిమానే ” kcr “.. ఈ మూవీ ఇటీవలే థియేటర్ల లోకి వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతుందని సమాచారం. ఏ ఓటీటీలో రాబోతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కేసీఆర్ మూవీ సక్సెస్ మీట్ ఇటీవల జరిగింది.. ఆ ఈవెంట్ లో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ గురించి అప్పుడే రాకింగ్ రాకేష్ అఫిషియల్ గా ప్రకటించారు. రిలీజ్ డేట్ మాత్రం వెల్లడించలేదు. డిసెంబర్ నెలాఖరున లేదా జనవరి ఫస్ట్ వీక్‌లో కేసీఆర్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసీ ఆర్ మూవీకి గరుడ వేగ డైరెక్టర్ దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నిక అయిన పరిణామాలకు లండాడీ యువకుడి జర్నీని జోడించి డైరెక్టర్ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చిండు.. ఈ మూవీలో సినీ నటి సత్య కృష్ణ కూతురు తనయ అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎమోషనల్ డ్రామా మూవీలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకు కథను, స్క్రీన్‌ప్లేను సమకూర్చాడు. నవంబర్ నెలాఖరున థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమాలో రాకింగ్ రాకేష్ భార్య సుజాత కూడా ఇందులో ఓ పాత్రలో నటించింది. ఇక ఈ మూవీలో తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణితో పాటు పలువురు ప్రత్యేక పాత్రల్లో నటించారు.
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల్లో కేసీఆర్ మాట్లాడిన మాటలు అతన్ని ఉత్తేజ పరుస్తాయి. తెలంగాణ కోసం పోరాడాలి, ఎలాగైనా సాధించాలి అనే కసితో యువకుడు ముందడుగు వేస్తాడు. ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు. తన పెళ్లి కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని ఆశ పడతాడు. కేసీఆర్‌ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది. కేశవ చంద్ర రమావత్ కేసీఆర్‌ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యను ఆయన చెప్పాడా? దానికి పరిష్కారం దొరికిందా అనేది ఈ మూవీ స్టోరీ.. ఒక వ్యక్తి చేసే మంచి పనులు యువతను ఎలా మారుస్తాయి అనేది మూవీ స్టోరీ.. ఇక ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందని తెలుస్తుంది. మరి ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
Comentários