top of page

మంచు మనోజ్ చేతుల మీదుగా 'జగన్నాథ్' మూవీ టీజర్ లాంచ్

  • Feb 14, 2025
  • 2 min read

మంచు మనోజ్ చేతుల మీదుగా 'జగన్నాథ్' మూవీ టీజర్ లాంచ్

▪️ రాయలసీమ భరత్ హీరోగా 'జగన్నాథ్' మూవీ

▪️ నవ్వులు పండించిన జబర్దస్త్ కామెడియన్లు

▪️ రాయచోటిలో ఘనంగా 'జగన్నాథ్' వేడుక

భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై భరత్, సంతోష్ దర్శకత్వంలో, పీలం పురుషోత్తం నిర్మాణంలో తెర‌కెక్కుతున్న మూవీ 'జగన్నాథ్'. రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటిస్తున్న ఈ మూవీ టీజర్‌ను, పోస్టర్‌ను ముఖ్య అతిథిగా పాల్గొన్న రాక్‌స్టార్ మంచు మనోజ్ రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఘనంగా జరిగిన 'జగన్నాథ్' మూవీ టీజర్ లాంచ్ వేడుకలో జబర్దస్త్ కామెడియన్లు అప్పరావు, వినోదిని, గడ్డం naveen పాల్గొని వినోదం పంచారు.


ఈ సంద‌ర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. "జగన్నాథ్ మూవీ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. తమ్ముడు 'రాయలసీమ' భరత్ చేసిన ఫ‌స్ట్ మూవీ అయినప్పటికీ ఎంతో ప్రొఫెషనల్‌గా చేశాడు. చిత్ర యూనిట్‌లో ప్రతి ఒక్కరి కష్టం కనపడుతోంది. భరత్ ఫ్రెండ్స్ అంతా ముందుకు వచ్చి ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో సినిమా తీర్చడం అంత ఈజీ కాదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో పట్టుదలతో ఈ సినిమా తీశారు. కోటి రూపాయలతో తీసిన సినిమా చిన్నది, వెయ్యి కోట్లతో తీసిన సినిమా పెద్ద సినిమా అని చెప్పడానికి లేదు. ఏదైనా సినిమా. కాకపోతే, బాగుందా? బాగాలేదా? అనేదే ఉంటుంది. ఈ సినిమా 'జగన్నాథ్' హిట్ కావాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టీమ్!" అని అన్నారు.


హీరో రాయలసీమ భరత్ మాట్లాడుతూ.. "మంచు మనోజ్ అన్న మంచి మనసున్న వ్యక్తి. 'జగన్నాథ్' మూవీ వేడుక కోసం ఆయన స్వచ్ఛందంగా వచ్చారు. నిజంగా గ్రేట్ పర్సన్. సినిమాల మీద ఇష్టంతో ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాను. నిరంతరం పని చేస్తూ 5 సంవత్సరాల శ్రమతో 'జగన్నాథ్' మూవీని పూర్తి చేశాం. ఈ ఐదేళ్లు వెంకీ, చైతూ.. నా వెంటే ఉంటూ సొంత తమ్ముళ్ల మాదిరిగా కష్టాలు పంచుకున్నారు. సపోర్టుగా నిలిచిన కదిరి భాషకు థ్యాంక్యూ. సినిమా బాగా వచ్చింది." అని అన్నారు.


'జగన్నాథ్' మూవీ – కాస్ట్ & క్రూ


తారాగణం (Cast):

- రాయలసీమ భరత్ (హీరో)

- సారా, ప్రీతిరెడ్డి, నిత్యశ్రీ, తదితరులు


సాంకేతిక నిపుణులు (Crew):

- దర్శకులు: భరత్, సంతోష్

- నిర్మాత: పీలం పురుషోత్తం


సహనిర్మాతలు:

- మదినే దుర్గారావు

- బుక్కే వేను మాధవి

- బుట్టమనేని వెంకటేష్

- నాగ చైతన్య రాయల్స్


కార్యనిర్వాహక నిర్మాతలు:

- మదన్ అర్జున్

- రామ

- డోలీ అనిల్

- కింగ్ జగపతి రాజు


లైన్ ప్రొడ్యూసర్: టి. సుబ్బారాయుడు

సంగీతం & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శేఖర్ మొపూరి

కథ, మాటలు: నందమూరి హరి, ఎన్టీఆర్

డైలాగ్స్ & స్క్రీన్‌ప్లే: శివక్ వాలి, క్రాంతి కుమార్ కొండెల

వీఎఫ్‌ఎక్స్ & డీఐ:జెమినీ ల్యాబ్

పోస్ట్ ప్రొడక్షన్:సూపర్ గుడ్ స్టూడియో

సౌండ్ డిజైనింగ్ & మిక్సింగ్:శ్యామల్ సిద్ధార్

పీఆర్వో:కడలి రాంబాబు, దయ్యాల అశోక్

Comments


bottom of page