top of page

బుక్ మై షోలో తల మూవీ టికెట్ కొనుకున్న కింగ్ నాగార్జున.. టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పిన నాగార్జున

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • Feb 13, 2025
  • 1 min read

బుక్ మై షోలో తల మూవీ టికెట్ కొనుకున్న కింగ్ నాగార్జున.. టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పిన నాగార్జున

దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తల'. ఈ సినిమాతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. రోహిత్, ఎస్తేర్ నోరన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీతం అందించారు. 'తల' చిత్రం ఈ 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ చూసిన వాళ్లంతా ఈ సినిమా చాలా ప్రామిసింగ్ గా ఉందని ప్రశంసిస్తున్నారు.

ఇటీవల, కింగ్ నాగార్జున బుక్ మై షోలో ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా ట్రైలర్‌ను చూసి చాలా మెచ్చుకున్నారు. రాగిన్ రాజ్ పెద్ద హీరో అవుతారని ఆశీర్వదించారు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం చాలా ఆసక్తికరంగా ఉందని ప్రశంసించారు. అమ్మ రాజశేఖర్‌తో తన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. నిర్మాత శ్రీనివాస్ గౌడ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

బుక్ మై షోలో నాగార్జున తల మూవీ ఫస్ట్ టికెట్ కొనడం, ఈ సినిమాకు పెద్ద విజయాన్ని సాధించనున్నట్లు సూచిస్తున్నట్లు దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు.


దర్శకుడు: అమ్మ రాజశేఖర్

నిర్మాత: శ్రీనివాస్ గౌడ్

బ్యానర్: దీపా ఆర్ట్స్

నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్

రైటర్స్: అమ్మ రాజశేఖర్

డీఓపీ: శ్యామ్ కె నాయుడు

సాంగ్: థమన్ ఎస్‌ఎస్

మ్యూజిక్ డైరెక్టర్: ధర్మతేజ, అస్లాం కేఈ

బీజీఎం: అస్లాం కేఈ

డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్

ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ

డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్

లిరిసిస్ట్స్: ధర్మతేజ

ఎడిటర్: శివ సామి

పీఆర్వో: మధు వీఆర్

డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం

Comments


bottom of page