నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీగా 'తండేల్' అవుతుంది: నాగచైతన్య
- Vijaya Preetham
- Feb 7, 2025
- 1 min read
నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీగా 'తండేల్' అవుతుంది: నాగచైతన్య


యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం "తండేల్". చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య విలేకరులతో మాట్లాడారు.
నాగచైతన్య మాట్లాడుతూ, "నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీగా 'తండేల్' వస్తోంది. ఆల్రెడీ సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నాకు కూడా ఎమోషనల్ హై ఇచ్చింది. చివరి ముప్ఫై నిమిషాలు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. క్లైమాక్స్ గొప్ప ఎమోషనల్ హై ఇస్తుంది. పాత్రకు తగ్గట్టుగా మారాలంటే వాళ్ల లైఫ్ స్టయిల్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి వాళ్లను నేరుగా కలవాలి కాబట్టి వాళ్లను వెళ్లి కలిశాను. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్‌ఫర్మేషన్ మీదే వున్నాను. శ్రీకాకుళం యాస గురించి ట్యూషన్ తీసుకున్నాను. యాస రియల్లీ ఛాలెంజింగ్‌గా అనిపించింది.
పల్లవి ఫాంటాస్టిక్ యాక్టర్. పల్లవితో యాక్ట్ చేయడం చాలా ఇష్టం. ఆమెలో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. క్యారెక్టర్‌ను డీప్‌గా అర్థం చేసుకుంటుంది. ఒక ఆర్టిస్ట్ అలా వుంటే మన పెర్ఫార్మెన్స్ కూడా రెట్టింపు అవుతుంది. సాయి పల్లవితో డ్యాన్స్ చేయాలంటే కష్టపడాలి. కానీ చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. మా ఇద్దరి మధ్య ఒక సాంగ్ థీమ్ కూడా శివ-పార్వతుల ప్రేమ కథ మీద ఉంటుంది. మా క్యారెక్టర్స్ కూడా సినిమాలో శివ-పార్వతుల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేయబడ్డాయి" అని చెప్పారు.



Comments