top of page

జీ స్టూడియోస్ సమర్పణలో వానరా సెల్యులాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ నిర్మిస్తున్న ‘బ్యూటీ’ టీజర్ విడుదల

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • Feb 15, 2025
  • 1 min read

జీ స్టూడియోస్ సమర్పణలో వానరా సెల్యులాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ నిర్మిస్తున్న ‘బ్యూటీ’ టీజర్ విడుదల

వానరా సెల్యులాయిడ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఆడియెన్స్‌ను మెప్పించబోతుంది. మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బారిక్సి’ నిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ను అందించేందుకు మారుతీ టీమ్ ప్రొడక్ట్‌తో కలిసి ‘బ్యూటీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ వంటి చిత్రాలతో పేరు పొందిన వర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య మరియు నీలఖి పాత్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పని చేస్తున్నారు.


తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఈ సినిమా పట్ల ఆడియెన్స్‌లో ఆసక్తిని రేపాయి. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన *బ్యూటీ* టీజర్ మరింత ఆసక్తిని పెంచింది. ఈ టీజర్ ఎంతో బ్యూటీఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. అందమైన ప్రేమ కథతో పాటు మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను కూడా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. టీజర్‌లో అంకిత్ కొయ్య, నీలఖి పాత్రలు, నరేష్ తండ్రిగా, వాసుకి తల్లిగా నటించారు.


టీజర్ చూస్తుంటే ఓ స్కూటీ చుట్టూనే ఈ కథ తిరిగేలా ఉందని అనిపిస్తోంది. స్కూటీ వచ్చాక ఏమి జరుగుతుంది? అసలు హీరోయిన్ స్కూటీని ఎందుకు అడుగుతోంది? ఆ స్కూటీ వచ్చాక heroineలో వచ్చే మార్పులు ఏంటీ? ఈ ప్రేమ కథలో ఎలాంటి ట్విస్టులు వస్తాయి అనే ఆసక్తికరమైన ప్రశ్నలు కలుగుతున్నాయి. టీజర్‌ లో విజువల్స్, ఆర్‌ఆర్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి. "లైఫ్‌లో నిన్ను ఇంకేం అడగను" అనే డైలాగ్‌కు సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉందనిపిస్తోంది.


శ్రీ సాయి కుమార్ దారా విజువల్స్, విజయ్ బుల్గానిన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. ఎస్‌బీ ఉద్ధవ్ ఎడిటర్‌గా, బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.


నటీనటులు:

అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా


సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: వర్ధన్

నిర్మాతలు: అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్

బ్యానర్లు: వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్. రావు

DOP: శ్రీ సాయి కుమార్ దారా

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఎడిటర్: SB ఉద్ధవ్

ఆర్ట్: బేబీ సురేష్ భీమగాని

PRO: సాయి సతీష్

Comments


bottom of page